Weekely Horoscope

Weekely Horoscope

aries

మీ పదోన్నతి పెంచుటకు వచ్చిన అవకాసములను అనుకూలపరచుకొంటారు, నూతన సంవత్సర వేడుకలలో పాల్గొంటారు, ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది, పూర్వపు పొరపాటులను తిరిగి రాకుండా [చేయకుండా] జాగ్రత్త పడతారు, చెడు అలవాట్లకు దూరముగా ఉండుట మంచిది.వచ్చిన ఆదాయము ఖర్చుకు సరిపడి వుంటుంది, పెద్దవాళ్ళ రాకతో సభలు సమావేశాలలో పాల్గొన వలసి వస్తుంది, వ్యపారము పెంచడానికి ఆలోచన చేయుట మంచిది, కొన్ని విషయాలు రహస్యముగా ఉంచడము మంచిదని తెలిసివస్తుంది. కుభేర పాశుపతము అభిషేకము చేయించండి.

taurus

మీ కోపమువల్ల ఇంటిలో సౌఖ్యము ఆనందము కరువగుతుంది, కొన్ని విషయాలలో భార్యాభర్తల మద్య విభేదాలు వచ్చుటకు అవకాశముంది, దంపతులు తగవులు పెట్టుకోవద్దు, ప్రయాణము వాయిదాపడుతుంది, ఒక ఒప్పందము ఇబ్బంది కలిగించే అవకాశముంది.ఆదాయము బాగుండముతో ఆనందముగా వుంటారు, ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు, బందువుల రాక ఆత్మీయుల రాక సంతోషాన్ని ఇస్తుంది, వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. గురువారము బాగుంటుంది, వాహన ప్రమాదము నుంచి తప్పించుకొంటారు. లక్ష్మి పూజ శుభము.

gemini

మిమ్మలిని మీవారు పై వారు కూడా పొగుడుతారు, సంఘములో గౌరవము పెరుగుతుంది, మద్యవర్తిత్వములో ధనదాయము, ధనలాభము,ప్రయాణములో  వివాస్పదవిషయాలకు దూరముగా ఉండుట మేలు. మీ ప్రయాణాలు లాబిస్తాయి, వ్యాపారము ముందంజలో వుంటుంది, ఆదాయ వ్యవహారాలు లాభసాటిగా వుంటాయి, కొన్ని వ్యవహారాలలో  లౌఖ్యముగా మెలిగి మీ పనులు సాధించుకొంటారు. కుటుంబంలోని వారి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మిత్రుల రాక మీకు అనందాన్ని ఇస్తుంది, దత్తాత్రేయుల వారికి విభూది పూజ శుభము.

cancer

పనులు ముందుకు సాగకపోయినా మిత్రులతో వేడుకలలో పాల్గొంటారు, గురువారము ఒక వ్యక్తి వల్ల అనుకోని ఇబ్బంది కలిగే అవకాసము వున్నది, మీ సమర్ధతకు మంచి గుర్తింపు కలుగుతుంది, ధనము సర్దుబాటు కావడముతో మీ పిల్లల వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి, ఎప్పటి నుంచో వున్న ఒక సమస్య సర్దుబాటు దిశగా  సాగుతుంది, కోత్త పథకాలు ప్రారంబించడానికి మంచి సమయము, ఇంటిలో వారి ఆరోగ్యము పట్ల శ్రద్ధ అవసరము, సంతానానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు, భాగస్వామ్య వ్యాపారాల్లో ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. దుర్గా సూక్తముతో క్షరాభిషేకము చేయించండి.

leo

ఇంటిలోని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు, ఆదాయ వ్యయాలు సంతృప్తి కరముగానే వుంటాయి, ఒకరికి మద్యవర్తిత్వము వహించుటవల్ల మీరు ఇబ్బంది పడవలసి రావడమేకాక మాటకూడా పడవలసి రావచ్చు, మిత్రులవల్ల వచ్చిన సమస్యలు మిమ్మలిని చిరాకుకు గురుచేస్థాయి,డబ్బువిషయములో జగ్రత్తవహించుట మేలు.ఇతరుల విషయాలు పట్టించుకోపోవడము ఎంతమంచిదో తెలుసుంది, కొన్ని ప్రయత్నాలు రహసముగా చేయుట మంచిది, భందువుల సహాయము కలసిరావచ్చు, ప్రయాణము వాయిదా వేయుట మంచిది. లక్ష్మి పూజ మంచిది.

virgo

పెట్టిన పెట్టుబడికి తగ్గ అడయమును పొందుతుంటారు, కొత్తకొత్త ఆలోచనలతో వ్యాపారమును పెంచుతారు, కొన్నిపనులు ముందుకు సాగవు, మీరు తీసుకొనే నిర్ణయాలు మీ భాగస్వామికి నచ్చక మిమ్మలిని ఇబ్బందికి గురి చేసే అవకాశముంది, ఒక విషయములో కొంత ధనమును పోగోట్టుకోవలసిరవచ్చు, ఆదాయ వ్యయాలు సరి సమానముగా ఉన్నప్పటికీ ఇబ్బంది తప్పదు, ఉద్యోగస్తులు పై వారి గుర్తింపును పొడగాలుగుతారు, వ్యాపారములో ఈ వారము భార్య సలహా పాటించుట మీకు మంచిది, రాత్రి ప్రయాణాలు ఈ వారం వాయిదా వేయుట మంచిది. ఆంజనేయ స్వామి వారికీ  మంగళవారం తులసి పూజ చేయించండి.

libra

దైవపర కార్యక్రమములు దిగ్విజయంగా పూర్తిచేస్తారు, ధనాదాయము బాగుంటుంది, వివాహ వేడుకలలో పాల్గొంటారు, వృత్తికి సంబంధించిన విషయాలు అభివృద్ధికారముగా ఉంటాయి, స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెలకువ అవసరం, గృహ నిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకొంటారు, సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది, మిమాటకు విలువ పెరుగుతుంది, మీకంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారుల గురించి సన్నిహితులతో చర్చిస్తారు, కొత్త వ్యాపార ఆలోచనలు అమలులో పెట్టడానికి ప్రయత్నాలు సఫలీకృతమగుతాయి. గణపతి ఆరాధన శుభము

scorpion

డబ్బు  చేతికి అందకపోవడముతో ఆందోళన పెరుగుతుంది, చిరాకులు పెరుగుతాయి మీ సమస్యను  స్నేహితులు అర్ధం చేసుకొని సహాయము చేసే అవకాశముంది, సంతాన విషయములో కొన్ని జాగ్రత్తలు అవసరము, దూరపుబందువులు మీ ఇంటికి రావడముతో మీకు సంతోషమవుతుంది, డబ్బు కర్చు పెరుగుతుంది, ఆర్దిక పర సమస్యలనుచి బయటపడడానికి మరిన్ని ప్రయత్నాలు చేయవలసి వస్తుంది, కొన్ని వివాదాలలోకి పోకుండుటయే మేలు, వేడుకలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్త వహించుట మంచిది. విందు వినోదాలలో పాల్గొంటారు, చిన్నచిన్న సమస్యలు తొలగుతాయి, గణపతికి బుధవారం గరిక పూజ చేయండి.

sagittarius

పూర్వపు ఆస్తిని చేజిక్కించుకొనే విషయములో కొత్త ఆలోచనలు ఫలించే విధముగా వుంటాయి, కొన్ని పనులను ఆలోచించి చేయుట మంచిది, డబ్బు విషయములో ఒప్పందము మద్యవర్తిత్వము మీకు మంచిదికాదు, మిరుచేసే పనికి సహాయము లభించక పోవొచ్చు.కొన్ని పనులు పూర్తి కావడముతో ఆదాయము అంది ఇంటి పనుల విషయములో పెట్టుబడి పెట్టుట జరగ వచ్చు, మీ సంతానము  తీసుకు వచ్చిన సమస్య పూర్తికి కొందరి సహాయము కోరవలసి రావచ్చు, కొన్ని కలహాలు తప్పవు, వ్యాపార లావాదేవీలను వాయిదా వెయిట మంచిది, షేర్ల లో పెట్టుబడి  పెట్టె విషయములో కొంత అలోచించి నిర్ణయం తీసుకొనుట మంచిది, వెంకటేశ్వర స్వామివారిని దర్శించండి.

capricorn

కొత్త వస్తువుల కొనుగోలులో ఒక ఇబ్బంది తప్పదు, ఈవారము కర్చు అదుపులో వుండదు, ఒక వివాదము సమసిపోయి కొంతమంది మిత్రులను పొందుతారు, స్త్రీలకు వివాదాల వల్ల మానసిక ఇబ్బంది కలుగుతుంది, దైవ కార్యకమములు మీ మనస్సును ప్రశాంత పరిచినప్పటికినీ అనుకున్న విషయాలు మీకు అనుకూలించక చిరాకు పెరుగుతుంది, శుక్ర వారము మీరు అనుకొన్న పని పూర్తికాక శ్రమ పడవలసి వస్తుంది ఆలస్యముగా ఫలితము రావచ్చు. ఆదాయము కోసం నూతన ప్రయ్నతాలు ముందుకు సాగుతాయి, మిత్రుల విషయములో కొన్ని పొరపాట్లు మీ వల్ల జరుగ వచ్చు, లక్ష్మి నృసింహ కవచ పారాయణ మంచిది.

 

aquarius

ధనము పోగొట్టు కొనుటవల్ల ఇతరులవల్ల మాటలు పడే అవకాశముంది, కొన్ని వ్యవహారాలు స్నేహితుల,బంధువుల వల్లపూర్తిచేయగాలుగుతారు, ఉద్యోగ విషయము కొత్త వ్యక్తుల లబించే అవకాశముంది, పెద్దవారి ఆరోగ్యము పట్ల జాగ్రత్త మంచిది, ఈ వారము డబ్బు తో ప్రయాణము వాయిదా వేయడము మంచిది.తెలివి తేటలతో సమస్యలు సర్దుబాటు చేయగలుగుతారు, దైవ సందర్శనలు వుంటాయి, ధన విషయములో జాగ్రత్త, గవర్నమెంటు పనుల విషయములో నోటిసు అందుకోవలసి రావచ్చు, సంతకాల విషయములో జాగ్రత్త. కలహాలకు దూరముగా వుండండి. కోపంలో చేసిన పనికి పచ్చాత్తాపం పడతారు, ఆంజనేయ స్వామి వారికీ సిందూర పూజ చేయించండి.

pisces

పనుల విషయములో తొందరపాటు మంచిదికాదు, అనుకొన్నది సాధించడానికి పట్టుదల శ్రమ ఉపయోగిస్తారు, స్నేహితుల బందువుల సహకారముతో ఒక శుభ కార్యక్రమ విషయము సానుకూల పద్ఫుతుంది, కర్చు అదుపుచేయడానికి చాల కష్ట పడవలసివస్తుంది, కొన్ని విషయములో మొహమాటము మంచిదికాదు.ప్రశాంతముగా అలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉండవచ్చు,వున్నా కర్చుకు డబ్బు వెతుకుకోవలసి వుంటుంది,మంగళ వారము ఇంటిలో గొడవలు పడే అవకాశముంది, భూమి వ్యవహారాలలో జాగ్రత్త వహించండి, రాజకీయముగా ఎదుగుదల కనపడగలడు, సభలు సమావేశాలలో పాల్గొంటారు. అష్ట లక్ష్మి పూజ శుభము.